Nee Chittame Song Lyrics

Nee Chittame Song Lyrics

నీ చిత్తమే -నాలో నెరవేర్చుచున్నావు
నిర్మలుడా…నజరేయుడా
ధన్యుడన్నయ్య – నీ దాసుడను
ధరణిలో నిను సేవించుచు (ధన్యుడన్నయ్య)

ఆరాధననే జీవనశలిగా జీవించెదనయ్యా..
జీవితమంతా నీ సాక్షిగనే…. . సాగిపోదును

ఆరాధన -ఆరాధన – ఆరాధన – నీకే
హల్లెలూయ – హల్లెలూయ హల్లెలూయ – ఆమెన్ (నీ చిత్తమే)

కన్నీటితో నీ పాదముల్ – కడుగనివ్వయ్యా
దుఃఖము కాదిది – ఆనందభాష్పాలే…నా యెడ చూపిన మేలులకై
ప్రేమాసాగర యేసయ్య…. ప్రేమంత నాకిచ్చినావయ్యా
నీ ప్రేమ నావలో యేసయ్య… తీరము చేరెద యేసయ్య (నీ చిత్తమే)

నీలోనే నిలిచి ఫలియించగా… నీకు మహిమయ్యా
నాలోనే నీవుండి, నను మార్చాగా….మారిపోదును, నీ రూపులో
కరుణామయూడా యేసయ్య…. కృపలను నాకిచ్చి నావయ్యా
క్రియలను చూసి గర్వించక… ఒదిగి ఉందును యేసయ్య (నీ చిత్తమే)

నా ఎదుటే నీవుండగా… విజయోత్సవమేగా…
వెన్నంటి నీవు.. నడిపించుచుండగా సాగిపోదును సీయోనుకు
సర్వోన్నతుడవు యేసయ్య…. సర్వము నాకిచ్చినవయ్య
సర్వము నీవే యేసయ్య .. సన్నుతింతును యేసయ్య (నీ చిత్తమే)

Music : Steven Paul K

Chorus : Revathi

Flute : Ramesh

Studios : Ahava Studios

Mix& Master : Ranjith J Kumar

Video : Yedidiah Pictures

 

Nee Chittame Song Lyrics

Nee Chittame Full Video Song

 

 

 

 

 

Leave a Comment