Adbhuthakarudavu Neevenani Song Lyrics

Adbhuthakarudavu Neevenani Song Lyrics

అద్భుత కరుడవు నీవేనని
ఆదియు అంతమైయున్నావని “2”
యేసయ్య నీ సన్నిధిలో – పరవశించెద…”2″

నా మార్గములో కాపాడినావు
నీ మార్గములో నడిపించావు “2”
తొట్రిల్ల నీయక.. కృప నాకొసగి…”2″ స్థిరపరిచావు
యేసయ్యా పాదాల చెంత -ప్రణమిల్లెదనయ్యా

సత్యము నీవై…. సాక్షాత్కరించావు
స్వతంత్రునిగా…..విడిపించావు “2”
నీ ప్రేమ ఖైదీ నై…నీ గుండె గుడిలో”2″ జీవించెదను
యేసయ్య కౌగిలిలోనే సేద తీరెదా…

జీవాధిపతి వై జీవింపచేసావు
జీవపు వాక్కును నా నోట ఉంచావు”2″
నిర్జీవము విడిచి…ఉజ్జీవముతో”2″
వేచియుందును..
యేసు నీ రాజ్యములో నే పరిపాలించెదా.

 

Lyrics, Tune, Sung by: Pastor. Kishan
Music Composed by: Steven Paul K, Machilipatnam
Mix and Master by: Ranjith J Kumar, A Mac Studios

 

 

Leave a Comment